ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేర్వేరు సందర్భాల్లో అందిన 2వేల 772 కానుకలను వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ వస్తువుల ధర రూ.200- రూ. 2.5 లక్షల మధ్యలో ఉంటుందని పటేల్ తెలిపారు.
మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా... - కానుకలు
ప్రధాని మోదీకి అందిన దాదాపు 2,700 కానుకలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. వీటి ధర కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ. 2.5 లక్షలని స్పష్టం చేశారు.
మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...
మోదీ వస్తువులు ఇలా వేలం వేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలోనూ దాదాపు 14 రోజుల పాటు వేలం నిర్వహించారు. 18వందలకుపైగా కానుకల విక్రయంతో వచ్చిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన 'నమామి గంగా' ప్రాజెక్టుకు ఇచ్చారు.
ఇదీ చూడండి:-అభాగ్యురాలి అంతిమయాత్రకు సైకిలే రథమైంది!
Last Updated : Sep 30, 2019, 5:48 AM IST