తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్మూలో విద్యార్థుల హాజరు 100% ​: కేంద్ర హోంశాఖ - జమ్ము కశ్మీర్​లో విద్యార్థుల హాజరు శాతాన్ని వెల్లడించిన కేంద్ర హోంశాఖ

జమ్ముకశ్మీర్​లో విద్యార్థుల హాజరు శాతాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. జమ్మూలో 100శాతం, కశ్మీర్​లో 20 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్​లో జనసంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది.

కశ్మీర్​లో ఎలాంటి ఆంక్షలు లేవ్​: కేంద్ర హోంశాఖ

By

Published : Oct 20, 2019, 8:15 PM IST

ప్రస్తుతం జమ్మూలో 100 శాతం, కశ్మీర్‌లో 20 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో 21 వేల 328 పాఠశాలలు తెరుచుకున్నాయని వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లో జనసంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటించింది.

అక్టోబర్‌ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,02,069 ల్యాండ్‌లైన్​ఫోన్ల సేవలను పునరుద్ధరించామని గత శుక్రవారం వరకు 22 జిల్లాల్లో 84 శాతం చరవాణి సేవలను పునరుద్ధరించినట్లు హోంశాఖ తెలిపింది.

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి జమ్ముకశ్మీర్‌లో జనసంచారం, వాహనాలు, ఫోన్‌ కనెక్షన్లపై ఆంక్షలు విధించింది సర్కారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 130 ప్రధాన ఆసుపత్రులు, 4,359 ఆరోగ్య కేంద్రాలు సేవలందిస్తున్నాయని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఇప్పటికే 5 నుంచి 12 వ తరగతులకు వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించారు.

ఇదీ చూడండి:నవంబర్​ 9న కర్తార్​పుర్​ నడవా ప్రారంభం... కానీ...

ABOUT THE AUTHOR

...view details