తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర 'రైతు బంధు'లో 2.69 లక్షల మందికి నిరాశ

బ్యాంకు ఖాతాల్లో  పొరపాట్ల కారణంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి కింద తొలి విడతలో 2.69 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరలేదు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులుగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్​ రుపాలా.

2.69 లక్షల మంది రైతులకు నిరాశ

By

Published : Jul 19, 2019, 10:21 PM IST

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి తొలి విడతలో 2.69 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరలేదు. బ్యాంకు ఖాతాల్లో పొరపాట్ల కారణంగానే ఇలా జరిగిందని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రుపాలా. ఈ పొరపాట్లను సరిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపారు.

సరైన భూ రికార్డులు లేని కారణంగా మణిపూర్, నాగాలాండ్‌, ఝార్ఖండ్‌లలో పథకం అమలులో సమస్యలు ఉన్నట్లు తెలిపారు రుపాలా​. త్వరలోనే ఈ అడ్డంకులు తొలగుతాయని చెప్పారు.

ప్రధాన మంత్రి కిసాన్‌ పథకం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కేంద్రం ప్రారంభించింది. ఏటా 3 వాయిదాల్లో రూ.6 వేలను పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది కేంద్రం.

ఇదీ చూడండి: మానవ హక్కుల బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details