ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా.. భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 559కి చేరగా.. కేసుల సంఖ్య 17,656కు పెరిగింది.
కరోనా కలవరం: దేశంలో 559కి చేరిన మృతుల సంఖ్య - కరోనా కొత్త మరణాలు
దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. గుజరాత్లో కొత్తగా 108 కేసులు నమోదు కాగా, బంగాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 245కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 559 మంది మహమ్మారికి బలయ్యారు.
దేశంలో 17వేలు దాటిన కరోనా కేసులు
ఆయా రాష్ట్రాల్లో నేటి కేసులు
- గుజరాత్లో ఈరోజు మరో 108 మందికి కరోనా నిర్ధరణయింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,851 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో నలుగురు మరణించగా.. మెత్తం మృతుల సంఖ్య 67కు చేరింది.
- బంగాల్లో గడిచిన 24 గంటల్లో 54 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు నమోదైన యాక్టివ్ కేసుల సంఖ్య 245కు పెరిగింది.
- రాజస్థాన్‌లో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 57 మందికి వైరస్ పాజిటివ్ తేలింది. ఇందులో 43 మంది జైపుర్‌కు చెందినవారు. రాష్ట్రంలో మెత్తం 1,535 మందికి వైరస్ సోకగా.. 25 మంది మరణించారు.
Last Updated : Apr 20, 2020, 8:06 PM IST