బిహార్ శాసనసభ ఎన్నికల్లో 25 శాతానికిపైగా నేర చరితులు పోటీ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మూడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 371 మంది మహిళలతో సహా మొత్తం 3,733 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మొత్తం 1,157 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు చివరి దశ పోలింగ్ పూర్తయ్యాక ప్రకటించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరితను నిర్ణీత గడువులోగా ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎంచుకోవడానికి గల కారణాలను తెలపాలని పార్టీలకు స్పష్టం చేసింది.
ఇదే తొలిసారి..
ఫలితంగా బిహార్లో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించాయి. పూర్తి స్థాయి ఎన్నికల్లో అభ్యర్థుల వివరాలను వెల్లడించటం ఇదే మొదటిసారి.
మూడు సార్లు ప్రకటించాలి..