తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

లోక్​సభ గడప దాటిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా బిల్లును నిరసిస్తూ.. 1000 మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పిటిషన్​ వేశారు. బిల్లులో ముస్లింలను మినహాయించడం... భారత ప్రాథమిక భావనకు వ్యతిరేకమే అని అన్నారు.

over-1000-scientists-scholars-sign-petition-demanding-withdrawal-of-citizenship-bill
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

By

Published : Dec 10, 2019, 3:21 PM IST

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై పలు చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. పలు రాజకీయ పార్టీలూ ఈ బిల్లును తప్పుపడుతున్నాయి. ఈ తరుణంలో దాదాపు 1000 మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు... కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

లోక్​సభలో సోమవారం బిల్లును ప్రవేశపెట్టకముందు వీరంతా ఓ పిటిషన్​పై​ సంతకం చేశారు. పౌరసత్వ బిల్లును ప్రవేశపెడుతున్నారని తెలుసుకొని.... సంబంధిత పౌరులుగా నిరాశతో ఈ ప్రకటన వెలువరిస్తున్నామని చెప్పారు.

''ప్రస్తుతం రూపొందించిన బిల్లుపై మాకు కచ్చితమైన సమాచారం ఏమీ లేదు. మీడియా నివేదికలు, 2019 జనవరిలో లోక్​సభ ఆమోదించిన మునుపటి బిల్లు ఆధారంగా మా ప్రకటన వెలువరించాం. అందరి విశ్వాసాలకు అనుగుణంగా, అందరినీ సమానంగా చూడాలని భారత ప్రాథమిక భావన చెబుతోంది. రాజ్యాంగంలో ఇదే పొందుపరిచారు.
ప్రతిపాదిత బిల్లులో మతాన్ని పౌరసత్వానికి ప్రామాణికంగా ఉపయోగించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉంది. ముస్లింలను మినహాయించడం, భారత భావనకు వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతం మా భయమంతా దీని గురించే.''

- పిటిషన్​లో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు

పిటిషన్​ వేసిన వారిలో హార్వర్డ్​, మసాచుసెట్స్, దిల్లీ యూనివర్సిటీ సహా పలు ఐఐటీ, ఐఐఎస్​ఈఆర్​, ఐఐఎస్​ అనుబంధ సంస్థల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే షాపై అమెరికా ఆంక్షలు!

ABOUT THE AUTHOR

...view details