పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత సైన్యం గెలుపునకు గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా జరుపుకునేందుకు దేశం సన్నద్ధమవుతోంది. అమర వీరుల త్యాగాలకు గుర్తుగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం జమ్ము కశ్మీర్‌లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వంద మందికిపైగా బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
"రక్తదానం అనేది ఎంతో గొప్ప విషయం. మేము దేశాన్ని రక్షిస్తామని మీకు తెలుసు. ఒకవైపు ప్రజలను కాపాడటం, దేశాన్ని రక్షించడం కోసం సరిహద్దులో పోరాటాలు చేస్తాం. మరోవైపు ఇక్కడ ఇలా రక్తదానం చేస్తాం. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొనాలి."
--- బీఎస్ఎఫ్ జవాను.
ఈ కార్యక్రమాన్ని 59వ బెటాలియన్- రాజౌరీ ప్రభుత్వ వైద్య కళాశాల సంయుక్తంగా నిర్వహించాయి.