అసోం జోర్హాట్ రాజామైదం రోడ్‌లోని నివాస సముదాయాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. పదికి పైగా ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. 'ఛఠ్ పూజ' సందర్భంగా ఇళ్లలో దీపాలు వెలిగించే క్రమంలో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.
అసోంలో అగ్ని ప్రమాదం- పదికి పైగా ఇళ్లు దగ్ధం - జోర్హాట్ రాజామైదం రోడ్ అగ్నిప్రమాదం
అసోంలో 'ఛఠ్పూజ' వేడుకల్లో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదం సంభవించి పదికి పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. పూజ సందర్భంగా దీపాలు వెలిగించే క్రమంలో ఈ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.
అసోంలో అగ్ని ప్రమాదం.. పదికి పైగా ఇళ్లు దగ్ధం
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద స్థలానికి ఆనుకుని ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆదాయం రూ.1000.. కరెంటు బిల్లు 29 వేలు!