తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నూతన భద్రతా సవాళ్ల కోసం.. నవీన సాంకేతిక పరిజ్ఞానం: మోదీ - modi on pak

భారత రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాబోయే ఐదేళ్లలో రూ.35వేలకోట్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను సాధించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదురోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 174 దేశాల రక్షణ ఉత్పత్తుల తయారీదారులు పాల్గొంటున్నారు.

defence
డిఫెన్స్ ఎక్స్​పోలో ప్రధాని మోదీ

By

Published : Feb 5, 2020, 3:53 PM IST

Updated : Feb 29, 2020, 6:55 AM IST

నూతన భద్రతా సవాళ్ల కోసం.. నవీన సాంకేతిక పరిజ్ఞానం: మోదీ

భారత్​కు ఎదురయ్యే నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా రక్షణదళాలు పనిచేస్తున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరుగుతున్న భారత 11వ రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన(డిఫెన్స్​ ఎక్స్​పో)ను ప్రధాని ప్రారంభించారు. రక్షణరంగంలో కృత్రిమ మేధస్సు వినియోగించే దిశగా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రధాని.

రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో గత రెండేళ్లలో రూ. 17వేల కోట్ల ఆదాయాన్ని సాధించామన్న మోదీ.. రాబోయే ఐదేళ్లలో రూ. 35వేల కోట్ల ఎగుమతులు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సరైన ప్రణాళికలు లేకే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్​ మారిందని గత ప్రభుత్వాల విధానాలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో దేశీయ రక్షణ ఉత్పత్తుల రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు.

"భారత అతిపెద్ద రక్షణ అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనగానే కాదు.. ప్రపంచంలోని ప్రముఖ డిఫెన్స్​ ఎక్స్​పోల్లో ఒకటిగా మారింది. ఈరోజు భారత రక్షణ గురించి ఆలోచించే వారే కాదు.. యువతకు కూడా అతి ప్రాముఖ్య దినం. మేక్​ ఇన్​ ఇండియా ద్వారా భారత రక్షణ బలపడటమే కాదు.. యువతకు ఉద్యోగాల కల్పన కుడా జరుగుతుంది. దీనిద్వారా భవిష్యత్తులో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులూ పెరుగుతాయి. ఈ రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగాల కల్పనే కాదు. భారత్​పై ప్రపంచదేశాల విశ్వాసాన్ని పెంచుతుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

రెండేళ్లకోసారి జరిగే ఈ కార్యక్రమంలో భారత్​లో తయారయిన రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఐదురోజుల పాటు జరగనున్న ఈ మెగా ఈవెంట్​లో40 దేశాలకు చెందిన మంత్రులు, 70 దేశాల ప్రతినిధులు, 172 దేశాలకు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీదారులు హాజరవుతున్నారు. 'రక్షణ ఉత్పత్తుల కార్యస్థానంగా ఎదుగుతున్న భారత్' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్​లో 856 స్వదేశీ రక్షణ సంస్థలు వాటి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

ప్రభుత్వ 'భారత్​లో తయారీ' విధానాన్ని ప్రదర్శింపజేసేలా చేపడుతున్న డిఫెన్స్ ఎక్స్​పో.. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చక్కటి వేదిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 320 మంది అవినీతి అధికారులకు కేంద్రం 'స్వస్తి'

Last Updated : Feb 29, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details