కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రధానంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకోసం భారత శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లూ తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
కరోనా టీకా వచ్చేది అప్పుడే... మోదీ క్లారిటీ - స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2020
కరోనా వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారని.. దీనికి సంబంధించి ప్రయత్నాలు ఉద్ధృతంగా సాగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. శాస్త్రవేత్తలు ఆమోదించిన వెంటనే టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అందరూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపిన మోదీ... వీలైనంత త్వరగా దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు పరీక్ష దశలో ఉన్నాయని.. వాటిని శాస్త్రవేత్తలు ఆమోదించిన వెంటనే ఆ టీకాలను భారీస్థాయిలో ఉత్పత్తి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. దీని కోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు.. అందరికీ టీకా అందించేందుకు పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:-'ఆత్మనిర్భర భారత్... 130 కోట్ల మంది సంకల్పం'