తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అది మాకు ఎప్పుడో తెలుసు'... నాసాకు ఇస్రో కౌంటర్​ - చంద్రయాన్​-2

​​​​​​​చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​ను తమ ఆర్బిటర్​ ఎప్పుడో గుర్తించిందని, ఆ విషయం తమ వెబ్​సైట్​లో ఉందని ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​ స్పష్టంచేశారు. ల్యాండర్​ విక్రమ్​ జాడను గుర్తించినట్లు నాసా మంగళవారం చేసిన ప్రకటనను ధ్రువీకరించాల్సిన అవసరం లేదన్నారు.

'Our own orbiter had located Vikram,' ISRO chief counters NASA claim
'అది మాకు ఎప్పుడో తెలుసు'... నాసాకు ఇస్రో కౌంటర్​

By

Published : Dec 4, 2019, 10:41 AM IST

చంద్రయాన్​-2కు చెందిన విక్రమ్​ ల్యాండర్​ శకలాలను గుర్తించినట్టు నాసా ప్రకటించడంపై కౌంటర్​ వేశారు ఇస్రో ఛైర్మన్​ కె శివన్​. తమ ఆర్బిటర్​.. ల్యాండర్​ను ఎప్పుడో గుర్తించిందని, ఆ విషయం ఇస్రో వెబ్​సైట్​లో ఉందని స్పష్టం చేశారు.

'అది మాకు ఎప్పుడో తెలుసు'... నాసాకు ఇస్రో కౌంటర్​

"దీనిపై ఇస్రో స్పందించదు. కానీ.. ల్యాండర్​ను ఆర్బిటర్​ గుర్తించిందని అదే రోజు(ల్యాండింగ్​ సమయం) మేము వెల్లడించాం. అది మా వెబ్​సైట్​లోనూ ఉంది. అవసరమైతే వెబ్​సైట్​ చూడండి."
- కె.శివన్​, ఇస్రో ఛైర్మన్​

రాజస్థాన్​లో జరిగిన ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రయాన్-2 ప్రయోగంలో చివరి నిమిషంలో గల్లంతైన ల్యాండర్​ విక్రమ్​ జాడ లభించిందని నాసా మంగళవారం ప్రకటించింది. తమ లూనార్‌ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో) విక్రమ్​ శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు జాబిల్లిపై శకలాలు ఉన్న చిత్రాన్ని విడుదల చేసింది.

అయితే... నాసా ప్రకటనను ధ్రువీకరించాల్సిన అవసరం ఇస్రోకు లేదని స్పష్టం చేశారు శివన్​.

ఇదీ చూడండి:- చంద్రయాన్​-2: 'విక్రమ్'​ జాడను 'షణ్ముగ' కనుగొన్నారిలా...

ABOUT THE AUTHOR

...view details