తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈసారి రెట్టింపు ఉత్తేజంతో దూసుకెళ్తాం : రాహుల్​ - rahul gandhi

మరో వారంలోగా కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టో విడుదల కానుంది. లక్షలాది మంది భారతీయులు, నిపుణులతో చర్చలు జరిపి మేనిఫెస్టో రూపొందించామని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీస ఆదాయ పథకం, ఉద్యోగ కల్పన వంటి అంశాలపై రాహుల్​ మనోగతం...

ఈసారి రెట్టింపు ఉత్తేజంతో దూసుకెళ్తాం:రాహుల్​

By

Published : Mar 29, 2019, 11:39 PM IST

ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం...

మేనిఫెస్టో తయారు చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. జాతీయస్థాయిలో నిపుణులు, అన్ని వర్గాల ప్రజలతో విస్తృతంగా చర్చించి మేనిఫెస్టోను రూపొందించాం. ఇది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుంది. కేవలం ఒక్కరి(మోదీ) ఆలోచనా విధానాలతో భారత్​ ముందుకు సాగదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలను మేం నమ్ముతాం.

న్యాయ్​ అందరిదీ...

న్యాయ్​(కనీస ఆదాయ పథకం) నా ఒక్కడిది కాదు. మేనిఫెస్టో రూపొందించే ప్రక్రియలో భాగంగా లక్షల మంది భారతీయుల కష్టాలు తెలుసుకుని తయారు చేసిన పథకం.

ఉద్యోగావకాశాలు

మేం రూపొందించిన మేనిఫెస్టోలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి వ్యూహాత్మక ప్రణాళికలు రచించాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు చేపడతాం.

ప్రభుత్వ పెట్టుబడులు

విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడానికి మేం కట్టుబడి ఉంటాం. సామాన్యులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

వారి ఆలోచనలు అసాధ్యం.

దేశమంతా ఒకే స్వరం వినిపించాలని భాజపా- ఆర్​ఎస్​ఎస్ అనుకుంటాయి. కానీ అది అసాధ్యం. వారిది ఏకపక్ష వైఖరి. వారిపై దేశంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇదే కాంగ్రెస్​ బలపడేందుకు ఉపయోగపడుతుంది.

రెట్టింపు ఉత్తేజంతో దూసుకెళ్తాం

2014 ఎన్నికలు అప్రస్తుతం. ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఉత్తేజంతో కాంగ్రెస్​ పార్టీ దూసుకెళ్తుంది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛనిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థలకు స్వతంత్రంగా పని చేసే అవకాశమిస్తుంది కాంగ్రెస్​. నోట్లరద్దు వంటి ఆనాలోచిత నిర్ణయాలను ప్రజలపై రుద్దదు.

అదే మంత్రం...

రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు ప్రభావవంతమైన నాయకులు ఉన్నారు. వారు బూత్​ స్థాయి కార్యకర్తల నుంచి అందరినీ కలుపుకుపోతారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే దీనికి ఉదాహరణ.

ఇదీ చూడండి:రెండు స్థానాల్లో పోటీపై రాహుల్​ స్పందన

ABOUT THE AUTHOR

...view details