తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీ ఆస్తులు రెండున్నర కోట్లు....

భారత ప్రధాని, వారణాసి లోక్​సభ భాజపా అభ్యర్థి నరేంద్ర మోదీ.. ఆస్తుల వివరాలు వెల్లడించారు. శుక్రవారం రోజు వారణాసిలో నామపత్రం దాఖలు చేసిన మోదీ... రూ. 2.5 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారు.

By

Published : Apr 27, 2019, 6:41 AM IST

మోదీ ఆస్తులు రెండున్నర కోట్లు

మోదీ ఆస్తులెంతో తెలుసా...

వారణాసి లోక్​సభ స్థానానికి నామినేషన్​ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన ఆస్తుల వివరాల్ని ప్రకటించారు. స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ. 2.5 కోట్లుగా పేర్కొన్నారు.

చరాస్తులు రూ. 1.41 కోట్లుగా తెలిపిన మోదీ.. రూ. 1.1 కోట్లను స్థిరాస్తులుగా ప్రకటించారు. సేవింగ్స్​ బ్యాంక్​ ఖాతాలో కేవలం రూ. 4, 143 ఉండటం గమనార్హం. గుజరాత్​ గాంధీనగర్​లో ఓ ప్లాట్ ఉన్నట్లు అఫిడవిట్​లో ప్రస్తావించిన మోదీ... ఆయన భార్యగా జశోదాబెన్​ను పేర్కొన్నారు.

ఫిక్స్​డ్​ డిపాజిట్ల రూపంలో రూ. 1.27 కోట్లు, చేతిలో 38 వేల 750 రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు.

1967లో గుజరాత్​ నుంచి పదో తరగతి, 1978లో దిల్లీ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్​లో డిగ్రీ, 1983లో గుజరాత్​ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ను విద్యార్హతలుగా అఫిడవిట్​లో ప్రస్తావించారు ప్రధాని.

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ వరుసగా రెండోసారి సార్వత్రిక బరిలోకి దిగుతున్నారు. సార్వత్రిక చివరి దశలో భాగంగా.. మే 19న ఇక్కడ ఎన్నిక జరగనుంది. శుక్రవారం రోజు ఈ స్థానానికి నామినేషన్​ వేసిన మోదీ.. తిరిగి గెలుపొందాలని చూస్తున్నారు. 2014లో మోదీ ఆస్తులు రూ. 1.65 కోట్లు.

ఇదీ చూడండి:జన బలం, ఐక్యతా మంత్రంతో కాశీ బరిలోకి...

ABOUT THE AUTHOR

...view details