కరోనాపై పోరుకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు తక్కువ ఖర్చుతో ప్రత్యేక గుడారాలను రూపొందించింది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించడానికి, స్క్రీనింగ్‌కు, క్వారంటైన్ అవసరాలకు 9.55 చదరపు మీటర్ల వైశాల్యంతో వీటిని తయారు చేసింది.
'కరోనా' కోసం రెండు పడకల గుడారాలొచ్చాయ్ - ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక గుడారాలను తయారు చేసింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు. వీటిని 9.55 చదరపు మీటర్లు ఉండేలా తక్కువ ఖర్చుతో చేసినట్లు తెలిపింది.
!['కరోనా' కోసం రెండు పడకల గుడారాలొచ్చాయ్ Ordnance Factory Board comes up with isolation tents](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6757820-thumbnail-3x2-asp.jpg)
రెండు పడకల.. గుడారాలొచ్చాయ్
వానను తట్టుకొని గుడారాలు భద్రంగా నిలిచేలా మధ్యలో ఉక్కు, అల్యూమినియం అల్లాయ్ ఊచల్ని ఉపయోగించారు. ప్రతి గుడారంలో రెండు పడకలు ఏర్పాటు చేసుకొనేందుకు వీలుంది. అవసరమైన చోట బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే వేగంగా వీటిని నిర్మించుకోవచ్చు. కాన్పూరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన 50 గుడారాలను అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులు అందించారు.