నవ భారతంపై ప్రపంచం చాలా ఆశలు పెట్టుకుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవలి అమెరికా పర్యటనలో వివిధ దేశాధినేతలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశమైనప్పుడు అన్ని చర్చల్లోనూ.. నూతన భరతావని కోసం ప్రపంచం ఆశావహ దృక్పథంతో చూస్తున్న విషయం గమనించినట్లు చెప్పారు. యువ భారత్ శక్తి సామర్థ్యాలపై వారందరికీ ఎంతో నమ్మకముందని తెలిపారు.
ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ.. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
" నేను ఈ మధ్యే అమెరికా నుంచి తిరిగొచ్చాను. ఈ పర్యటనలో ఎంతో మంది దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, నూతన ఆవిష్కరణలు చేసేవారిని, పెట్టుబడిదారులతో సమావేశమయ్యాను. ప్రతి సమావేశంలోనూ నూతన భారతావనిపై వారందరూ పెట్టుకున్న ఆశావహ దృక్పథాలే కనిపించాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి