తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రజనీతో పొత్తుకు సిద్ధం: పన్నీర్ సెల్వం - aiadmk party

తమిళ సూపర్​స్టార్​ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్​ సెల్వం స్పందించారు. ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

OPS Welcomes RajiNIs Entry Into Politics, Says Alliance Possible
రజనీతో పొత్తుకు సిద్ధం-పన్నీర్ సెల్వం

By

Published : Dec 4, 2020, 5:21 AM IST

సూపర్​స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశాన్ని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం స్వాగతించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్న పన్నీర్‌ సెల్వం అవకాశం ఉంటే రజనీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంతో కాలంగా రజనీ నిర్ణయం కోసం ఎదురుస్తున్న అభిమానులకు వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తామంటూ ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమిళ రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటివరకు స్తబ్ధుగా ఉన్న తమిళ భాజపా నాయకులు కూడా రజనీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్​స్టార్​ మద్దతు కూడగట్టే దిశగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాకు సూచనలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట భాజపా.. జెండా పాతాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి.

ఇదీ చూడండి: రజనీ రాజకీయానికి సవాళ్ల స్వాగతం

ABOUT THE AUTHOR

...view details