పార్లమెంటరీ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును ఎండగట్టారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. ఎటువంటి లక్ష్యం లేకుండా పార్లమెంటును బహిష్కరించిన విపక్షాలు... నిరసనలు, ధర్నాలు చేశాయని మండిపడ్డారు. విపక్షాలు నీతిలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. విప్లవాత్మకమైన బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు సభాధ్యక్షుడి మాట వినకుండా సభలో గందరగోళం సృష్టించారన్నారు జావడేకర్.
"పార్లమెంటులో ఎలాంటి సమస్యల మీదైనా చర్చించి, తమ అభిప్రాయలను తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. కానీ దానికి బదులు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి, ధర్నాకు దిగారు. రాజ్యసభను అవమానించారు. బిల్లులను ఆమోందించవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నారు."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి