తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాల వ్యూహరచన! - congress news

విపక్షాల సీనియర్ నేతలు దిల్లీలో సమావేశమయ్యారు. ఆర్​సెప్ సహా పలు ఆర్థిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్లమెంటు లోపల, వెలుపల ప్రశ్నించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాల వ్యూహరచన!

By

Published : Nov 4, 2019, 4:50 PM IST

Updated : Nov 4, 2019, 6:36 PM IST

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాల వ్యూహరచన!

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్​సీఈపీ) ఒప్పందం సహా పలు ఆర్థిక అంశాలపై చర్చించేందుకు విపక్షాలకు చెందిన ముఖ్యనేతలు దిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ తరఫున గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా హాజరయ్యారు. ఆర్​ఎల్ఎస్​పీ, సీపీఐ, సీపీఎం ,ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు చెందిన నేతలు భేటీలో పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాలు

నవంబర్ 18నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సహా దేశ వృద్ధిరేటు క్షీణత వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి.

ఈ అంశాలపై పార్లమెంట్ లోపల, వెలుపల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​.. విపక్షాల సమావేశంలో పాల్గొనలేదు.

ఇదీ చూడండి: ఆర్​సెప్​ సమావేశం.. భారత కీలక నిర్ణయం ఎటు..?

Last Updated : Nov 4, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details