వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదం పొందాయని పేర్కొంటూ.. వాటిని తిప్పి పంపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరారు విపక్ష నేతలు. బిల్లులను ఆమోదిస్తూ సంతకం చేయొద్దని కోరారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని విపక్ష సభ్యుల బృందం రాష్ట్రపతిని కలిసి ఈమేరకు విజ్ఞాపన పత్రం అందజేసింది. బిల్లుల ఆమోదానికి ముందు అన్ని పార్టీలు, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చించాల్సిందని అన్నారు ఆజాద్.