తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటి ప్రతిపక్షాల సమావేశం రద్దు

లోక్​సభ ఎన్నికల అనంతరం నేడు ప్రతిపక్షాలు తొలిసారిగా సమావేశమవ్వాలని నిర్ణయించుకున్న భేటీ రద్దయింది. కొందరు సీనియర్​ నేతలు అందుబాటులో ఉండకపోవటమే కారణం.

By

Published : May 31, 2019, 7:22 AM IST

ప్రతిపక్షాల సమావేశం రద్దు

నేటి ప్రతిపక్షాల సమావేశం రద్దు

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంపై చర్చించుకోవడం కోసం మే 31న భేటీ కావాలని నిర్ణయించుకున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం రద్దయింది. ఆయా పార్టీల్లోని కొందరు ముఖ్య నేతలు ఆ తేదీలో అందుబాటులో ఉండకపోవటమే కారణమని సమాచారం.

భాజపా చేతిలో ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకునేందుకు పార్లమెంటులో నేడు భేటీ కావాలని నిశ్చయించుకున్నాయి విపక్షాలు. జూన్​ 6న ప్రారంభమవుతాయని భావిస్తోన్న పార్లమెంటు సమావేశాల్లోనూ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈ భేటీలో చర్చించుకోవాలని తొలుత భావించారు.

కాంగ్రెస్​ నేతృత్వంలో జరగాల్సిన ఈ సమావేశం కొందరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండని కారణంగా ఇప్పుడు ఆకస్మికంగా రద్దయింది.

ABOUT THE AUTHOR

...view details