తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాల నిశబ్ద ర్యాలీ - opposition silent march against agri bills

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్​లో నిశబ్ద ర్యాలీ నిర్వహించారు విపక్ష పార్టీల ఎంపీలు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. రైతులను కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Opposition parties conduct silent protest march in Parliament over farm Bills
ఆ బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్​లో నిశబ్ద ర్యాలీ

By

Published : Sep 23, 2020, 2:54 PM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఆమోదానికి నిరసనగా విపక్ష పార్టీలు పార్లమెంట్ కాంప్లెక్స్​లో నిశబ్ద ర్యాలీ నిర్వహించాయి. 'రైతులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అనే ప్లకార్డులు చేతబట్టి ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.

గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన

పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ముందు మహాత్ముడి విగ్రహం వద్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.

"మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ వేయించిన రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిల్లులకు నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేస్తున్నాం. కాంగ్రెస్​తో పాటు భావసారూప్యత కలిగిన పార్టీలు ఇందులో పాల్గొన్నాయి."

-జైరాం రమేశ్, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ-ఎం, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎన్​సీపీ, తెరాస, సమాజ్​వాదీ పార్టీ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు చేతబట్టిన తెరాస ఎంపీలు

అంతకుముందు విపక్ష నేతలందరూ కలిసి లోక్​సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఛాంబర్​లో సమావేశమయ్యారు. బిల్లులకు వ్యతిరేకంగా తదుపరి కార్యచరణపై చర్చించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details