పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. 2019-20 వార్షిక బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ధరల పెంపును తీవ్రంగా తప్పుపట్టాయి. సుంకాల పెంపు సామాన్య మానవునిపై పెను భారంగా మారుతుందని పేర్కొన్నాయి. తక్షణమే సుంకాల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ... దేశంలో పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు ఎందుకు పెంచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్.
"ఈ ప్రభుత్వం విధించిన పన్నుల వల్ల సామాన్య ప్రజలు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక చమురు ధరలు చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ... మన ఆర్థిక మంత్రి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో 2 రూపాయల భారాన్ని మోపారు."
- శశి థరూర్, కాంగ్రెస్ నేత.