తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' బిల్లుపై విపక్షాల నోట పాక్​ మాట: మోదీ - జాతీయ వార్తలు తెలుగులో

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై విపక్ష సభ్యులు 'పాకిస్థానీ భాష' మాట్లాడుతున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో పౌరసత్వ బిల్లు, బడ్జెట్​ తదితర అంశాలపై చర్చించారు.

Oppn speaking Pak's language on Citizenship Bill: PM Modi at BJP meet
'పౌర' బిల్లుపై విపక్షాల నోట పాక్​ మాట: మోదీ

By

Published : Dec 11, 2019, 11:36 AM IST

భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఆయా పార్టీ సభ్యుల మాటతీరు.. పాకిస్థాన్​ భాషను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతుందని వ్యాఖ్యానించారు మోదీ.

పౌరసత్వ బిల్లును.. కశ్మీర్​కు ప్రత్యేక అధికారులు కల్పించే అధికరణ 370 రద్దుతో పోల్చారు ప్రధాని. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే మైనార్టీలకు ఈ బిల్లు శాశ్వత ఉపశమనం కల్పిస్తుందని స్పష్టం చేశారు.

బడ్జెట్​పై సలహాలు కోరండి...

2020 వార్షిక బడ్జెట్​ తదితర అంశాలపైనా పార్టీ ఎంపీలతో సమావేశంలో చర్చించారు మోదీ. రైతులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్​ రూపకల్పన చేయాలని పేర్కొన్నారు. ఎంపీలందరూ ఈ బాధ్యతలు తీసుకొని.. ఆర్థిక మంత్రికి ప్రజల సూచనలు, సలహాలను చేరవేయాలని నిర్దేశించారు.

ABOUT THE AUTHOR

...view details