రైతుల్లో నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించే విషయంలో భాజపా విఫలమైనట్టు ఆ పార్టీ పంజాబ్, హరియాణా నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు విపక్షం, కరోనా సంక్షోభమే కారణాలని చెప్పారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. వారి తప్పుడు ప్రణాళికలను అడ్డుకోవడంలోనే సమయం అయిపోయిందని పేర్కొన్నారు.
"భాజపాలోని ప్రతి ఒక్కరు.. రైతుల వెంటే ఉన్నారు. అన్నదాతల సంక్షేమం కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ చట్టలు తీసుకొచ్చింది. కానీ ఏదైనా మంచి చేద్దామనుకుంటే.. కొందరు తప్పుగా చూస్తారు. ఈ క్రమంలోనే విపక్షాల వ్యూహాలను అడ్డుకోవడంలో మేము ఇరుక్కుపోయాము. లేకపోతే.. రైతులకు ఈ చట్టాలపై అవగాహన కల్పించడంలో కచ్చితంగా విజయం సాధించేవాళ్లం."
--- సుర్జిత్ కుమార్ జయని, భాజపా నేత.
రైతులను సంప్రదించి, వారిలో ఉన్న సందేహాలను తీర్చడానికి భాజపా ఏర్పాటు చేసిన 8 మంది సభ్యుల ప్యానెల్లో జయని ఒకరు. ప్రభుత్వం- రైతుల మధ్య జరుగుతున్న చర్చల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:-మంగళవారం 'భారత్ బంద్'- అన్ని వర్గాల మద్దతు!