తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వంపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధం!

మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల కోసం విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉమ్మడి వ్యూహాలను రచిస్తున్నాయి. చైనాతో సరిహద్దు వివాదం, కరోనా సంక్షోభంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సమాలోచనలు చేస్తున్నాయి.

By

Published : Sep 6, 2020, 7:28 PM IST

Oppn planning joint offensive against govt in Parliament
ప్రభుత్వంపై ముప్పేట దాడికి విపక్షాలు సమాయత్తం!

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనపడుతోంది. ఈనెల 14న ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల బాణాలను ఎక్కుపెట్టేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు వివాదం, రాష్ట్రాల జీఎస్​టీ పరిహారం నేపథ్యంలో ప్రభుత్వంపై ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయి.

వివిధ విపక్ష పార్టీల నేతలు కొద్ది రోజుల్లో సమావేశమయ్యే అవకాశముంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై వీరు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఐకమత్యంతో ముందుకు సాగాలాని ఇప్పటికే పలువురు నేతలు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ వ్యూహాలు...

మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో.. పార్టీ వ్యూహ నిర్మాణ బృందం ఈ మంగళవారం భేటీకానున్నట్టు సమాచారం. ఈ బృందం ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. పార్లమెంట్​లో ప్రస్తావించాల్సిన విషయాలపై చర్చించింది.

ఇదీ చూడండి:-రాజ్యసభ 'పెద్ద'లకు కరోనా భయం!

ఏకాభిప్రాయాలున్న పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని కాంగ్రెస్​ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా నేతలతో సంప్రదింపులు జరపాలని పార్టీ సీనియర్​ నాయకులకు కాంగ్రెస్​ హైకమాండ్​ సూచించినట్టు తెలుస్తోంది.

సరిహద్దే కీలకం!

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ అంశాలపై కసరత్తు చేస్తున్నాయి విపక్షాలు. ముఖ్యంగా సరిహద్దు వివాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిశ్చయించుకున్నాయి. చైనాతో ప్రతిష్టంభనపై ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టేందుకు సిద్ధపడుతున్నాయి.

మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులు, ఫేస్​బుక్​ వివాదం కూడా చర్చకు రానుంది. కరోనా సంక్షోభంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టి వివిధ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది.

ఇదీ చూడండి:-కరోనా నెగిటివ్​ రిపోర్ట్​ చూపితేనే పార్లమెంట్​లోకి అనుమతి!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 ఆర్డినెన్స్​లను కూడా వ్యతిరేకించేందుకు కాంగ్రెస్​ సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్సులలోని మంచి-చెడులను పార్టీనేతలకు రాజ్యసభలోని కాంగ్రెస్​ చీఫ్​ విప్​ జైరామ్​ రామేశ్​ వివరించినట్టు సమాచారం.

'ప్రశ్నోత్తరాలు లేకపోతే ఎలా?'

ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని పునరుద్ధరించాలని కోరుతు లోక్​సభ స్పీకర్​, రాజ్యసభ ఛైర్మన్​లకు లేఖలు రాయనున్నారు ఇరు సభలకు చెందిన కాంగ్రెస్​ నేతలు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details