తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు' - ఝార్ఖండ్​

"పరీక్ష సరిగా రాయని విద్యార్థి ఇంటికెళ్లి పెన్ బాలేదని చెబుతాడు. అలానే విపక్షాలు ఈవీఎంలు బాలేదని సాకులు చెబుతున్నాయి" అని అన్నారు ప్రధాని. ఝార్ఖండ్​లోని లోహర్దాగలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

'విపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు'

By

Published : Apr 24, 2019, 3:02 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి పార్టీలకు ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే ఆయా పార్టీలు ఈవీఎంల పేరిట సాకులు వెతికే పనిలో ఉన్నాయని విమర్శించారు.

ఝార్ఖండ్​లోని లోహర్దాగలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు ప్రధాని.

'విపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు'

"మాపై మీరు(ప్రజలు) చూపిస్తున్న ఆదరణను చూసి... దిల్లీ కుర్చీపై ఆశలు పెట్టుకున్న అవినీతిపరులు, మహాకుమ్మక్కు పార్టీల నేతల గుండెల్లో ఆందోళన మొదలైంది. మూడు దశల ఎన్నికల తరువాత, 300 నియోజకవర్గాల్లో ఓటింగ్​ పూర్తయిన అనంతరం తాము అధికారంలోకి రాలేమని ప్రత్యర్థులు గ్రహించారు. పరీక్షల్లో పేలవ ప్రదర్శనకు సాకులు చెప్పే పిల్లల్లాగా.. ప్రతిపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేయటం ప్రారంభించాయి. దేశాభివృద్ధి కోసమే మీరు ఓటు వేయాలి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ చౌకీదార్​దే బాధ్యత అని భరోసా కల్పించారు మోదీ. కులం, మతం ఆధారంగా ప్రజలపై తానెప్పుడు వివక్ష చూపలేదన్నారు.

ఇదీ చూడండి:'అప్పటి పేదరికమే ఇప్పటి నా స్టైల్​కు కారణం'

ABOUT THE AUTHOR

...view details