తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దు'పై చర్చకు స్థాయీ సంఘం భేటీకి డిమాండ్​!

గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటన నేపథ్యంలో విదేశీ వ్యవహారలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించాలని డిమాండ్​ చేశారు పలువురు విపక్ష ఎంపీలు. 20 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు ప్యానెల్​కు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. అయితే.. కరోనా నేపథ్యంలో సమావేశ నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసింది భాజపా.

Par panel meeting,
సరిహద్దుపై చర్చకు స్థాయీ సంఘం భేటీకి డిమాండ్​!

By

Published : Jun 22, 2020, 5:31 AM IST

Updated : Jun 22, 2020, 6:47 AM IST

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటన నేపథ్యంలో విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం(పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ) సమావేశం నిర్వహించాలని పలువురు విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్​ చేశారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన అంశంపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కార్యదర్శలు సహా ఇతర ఉన్నతాధికారులు పూర్తి వివరాలను ప్యానెల్​కు వివరించాలని కోరారు.

" జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్య కాబట్టి సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలి. చైనాతో హింసాత్మక ఘటనపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు ప్యానెల్​కు పూర్తి వివరాలు వెల్లడించాలి. ఈ ఘటనపై పూర్తి అవగాహన ఉన్న ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం భేటీకి అనుమతించాలి."

- ఎన్​కే ప్రేమ్​చంద్రన్​, ఆర్​ఎస్​పీ ఎంపీ

రాజకీయలు మానుకోవాలి..

విపక్ష ఎంపీల డిమాండ్​ను రాజకీయ చర్యగా పేర్కొన్నారు పలువురు అధికార పార్టీ ఎంపీలు. కరోనా వైరస్​ విజృంభిస్తున్న వేళ ఈ సమావేశం నిర్వహించటం సాధ్యం కాదని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వానికి మద్దతుగా ఏకతాటిపైకి రావాలని కోరారు భాజపా ఎంపీ మీనాక్షిలేఖి. కరోనా వైరస్​ విజృంభిస్తున్న అంశంపై ఎందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి ఎందుకు డిమాండ్​ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుత డిమాండ్​ వెనక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు.

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా!

విపక్ష ఎంపీల డిమాండ్ల మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించే అవకాశాలపై సెక్రటరీ జనరల్స్​తో ఆరాతీశారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

ఇదీ చూడండి: భారత్​- చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి?

Last Updated : Jun 22, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details