తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీవీప్యాట్​ స్లిప్పులే ముందు గణించాలి: ఈసీతో విపక్షాలు - SUPREME

కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్షాల భేటీ ముగిసింది. 22 పార్టీలు ఈసీకి నివేదిక అందించాయి. చివరి రౌండ్​ కౌంటింగ్​ కంటే ముందుగానే ప్రతి అసెంబ్లీ స్థానంలోని ఐదు వీవీప్యాట్​ల స్లిప్పులు లెక్కించాలని ఈసీని కోరాయి.

వీవీప్యాట్​ స్లిప్పులే ముందు గణించాలి: ఈసీతో విపక్షాలు

By

Published : May 21, 2019, 5:26 PM IST

Updated : May 21, 2019, 5:36 PM IST

ఎన్నికల ఫలితాలకు ముందు 22 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. ఓట్ల లెక్కింపు విషయమై సుప్రీం కోర్టు సూచించిన విధంగా నడుచుకోవాలని ఈసీని కోరుతూ నివేదిక అందించాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 వీవీప్యాట్​ల స్లిప్పులను.. చివరి దశ కౌంటింగ్​ తర్వాత లెక్కించాలని ఈసీ చూస్తోందని విపక్షాలు మండిపడ్డాయి.

ఈవీఎంల రవాణాపైనా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్ట్రాంగ్​రూంల భద్రతపైనా నిఘా ఉంచాలని ఈసీకి నివేదించారు నేతలు. ఎన్నికల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని కోరాయి. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై ఈసీ రేపు చర్చిస్తామని తెలిపినట్లు కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ సింఘ్వీ వెల్లడించారు.

వీవీప్యాట్​ స్లిప్పులే ముందు గణించాలి

''మేం ఈ రోజు రెండు, మూడు ప్రధాన సమస్యల్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్​ల స్లిప్పులను యాదృచ్ఛికంగా లెక్కించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పుడు ఎన్నికల సంఘం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈవీఎం మెషీన్లలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని చూస్తోంది. అందుకు మేం సుముఖంగా లేం. ప్రతి అసెంబ్లీ స్థానంలోని 5 వీవీప్యాట్​ స్లిప్పులనే మొదటగా గణించాలి. అందులో ఏమైనా వ్యత్యాసం ఉంటే.. శాసనసభ పరిధిలోని మొత్తం వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలి. ఈవీఎం యంత్రాల్లో ఒక పార్టీ గుర్తుపై బటన్​ నొక్కితే వేరే పార్టీకి అంటే.. భారతీయ జనతా పార్టీకి వెళ్లింది. ''

- గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్ సీనియర్​ నేత

ఇదీ చూడండి:

వీవీప్యాట్ స్లిప్పులపై ఈసీని కలిసిన విపక్షాలు

Last Updated : May 21, 2019, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details