ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. 'ప్రతిపక్షనేతల ఉద్దేశాలు మంచివి కాకపోతే.. కారాగారంలో ఉండాలి లేదా బెయిల్‌పై ఉండాలని' వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్‌లో జరిగిన డివిజన్ స్థాయి బూత్ కమ్ శక్తి కేంద్ర కార్యకర్త సమ్మేళన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భాజపాకు నేతలు, ఉద్దేశాలు, కార్యక్రమాలు, కార్యకర్తలు ఉన్నారన్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో చరిత్ర సృష్టించడం భాజపా అదృష్టమని కార్యకర్తలకు వివరించారు నడ్డా.
'ప్రతిపక్ష నేతలకు అయితే జైలు లేదా బెయిల్' - భాజపా
భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతల ఉంటే జైలులో ఉండాలి లేదా బెయిల్‌పై ఉండాలని వ్యాఖ్యానించారు.
'ప్రతిపక్ష నేతలకు అయితే జైలు లేదా బెయిల్'
" దేశంలోని పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలను అనుసరిస్తున్నాయి. భాజపాలో మాత్రమే సామాన్య కార్యకర్త సైతం ముఖ్యమైన నాయకుడిగా ఎదిగేందుకు ఆస్కారం ఉంది. గోడలమీద పోస్టర్లు అంటించుకునే వారు కూడా పార్టీ అధినేత కావొచ్చు."
- జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు
Last Updated : Oct 1, 2019, 10:01 AM IST