విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందేభారత్ కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా ఇప్పటికే విమానాల ద్వారా పలువురిని స్వదేశానికి చేర్చింది. ఆపరేషన్ సముద్రసేతు కింద సముద్ర మార్గం ద్వారా మరికొంత మందిని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
ఆపరేషన్ సముద్రసేతు తొలి విడతలో భాగంగా మాల్దీవుల్లోని భారతీయులు నేడు స్వదేశానికి రానున్నారు. నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్‌ఎస్ మగర్ నేడు మాల్దీవుల్లోని భారతీయులతో కేరళ కొచ్చి తీరానికి చేరనున్నాయి. ఆ దేశంలోని మాలే నౌకాశ్రయం నుంచి రెండు యుద్ధ నౌకల్లో మొత్తం వెయ్యి మంది వెనక్కి రానున్నారు.