నేడు 87వ వైమానిక దళ దినోత్సవం. యూపీ ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ వేదికగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. వాయుసేన సిబ్బంది కవాతులు, విన్యాసాలు చేశారు.
సైన్యాధిపతి బిపిన్ రావత్, భారత వైమానిక దళం సారథి ఆర్కేఎస్ భదౌరియా, నౌకాదళ అధిపతి కరంబీర్ సింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద త్రివిధ దళాధిపతులు నివాళులు అర్పించారు.