దేశవ్యాప్తంగా మే 1 నుంచి 20 వరకు.. 1,813 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు స్పష్టం చేసింది రైల్వేశాఖ. వీటిలో 301 రైళ్లు మార్గ మధ్యలో ఉండగా.. 1,512 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు 22 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపారు అధికారులు.
22 లక్షల మందిని స్వస్థలాలకు చేర్చిన 'శ్రామిక్' రైళ్లు - RAIL-LOCKDOWN-TRAINS-TALLY
మే 1 నుంచి దేశవ్యాప్తంగా నడిపిన ప్రత్యేక రైళ్ల వివరాలను వెల్లడించింది రైల్వేశాఖ. ఇప్పటివరకు 1,813 శ్రామిక్ రైళ్లులో 22 లక్షల మంది వలసకూలీలను స్వస్థలాలకు చేర్చినట్లు స్పష్టం చేసింది.
22 లక్షల మందిని స్వస్థలాలకు చేర్చిన 'శ్రామిక్' రైళ్లు
ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 912 సర్వీసులు నడపగా.. బీహార్‌కు 398 రైళ్ల సేవలతో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ నుంచి 583 రైళ్లు, మహారాష్ట్ర నుంచి 320 రైళ్లు.. ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. మే 19న దేశవ్యాప్తంగా 204 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు.. రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ వెల్లడించారు.
Last Updated : May 20, 2020, 10:39 PM IST