భారతీయ రైల్వే మే 1 నుంచి 1,565 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపి, 20 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చినట్లు రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. మరో 116 రైళ్లు వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
పరిమితి పెంపు...
శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో అంతకుముందు నిర్దేశించిన 1200 మంది ప్రయాణికుల పరిమితిని 1700 మందికి పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే మొదట్లో ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం వెళ్లే వరకు మధ్యలో ఎక్కడా రైళ్లు ఆపేందుకు అనుమతించలేదు. కానీ ఇప్పుడు మూడు చోట్ల రైలు ఆగేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.