వర్షాలొస్తే ఖరీఫ్ పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. అయితే, ఈ ఏడాది వానలు ఓ నాలుగు రోజులు ఆలస్యంగా కురవనున్నాయని తెలిపింది భారత వాతావరణ శాఖ.
కేరళకు రుతుపవనాల ఆగమనం... దేశంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభానికి సంకేతం. అయితే ఈసారి కేరళను రుతుపవనాలు జూన్ 5న పలకరించనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.