తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య రామధామం- వెయ్యేళ్లు పదిలం'

అయోధ్య రామమందిరం నాణ్యతపై ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ కీలక విషయాలు వెల్లడించారు. నిర్మాణానికి పూర్తిగా రాళ్లనే ఉపయోగిస్తామని చెప్పిన ఆయన.. వెయ్యేళ్లయినా ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

VHP-RAM TEMPLE
రామధామం

By

Published : Aug 20, 2020, 5:11 AM IST

అయోధ్యలో రామాలయాన్ని పూర్తిగా రాళ్లతోనే నిర్మిస్తామని మందిర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వెయ్యేళ్లయినా ఎలాంటి వాతావరణానికి అయిన చెక్కుచెదరకండా ఉండేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. మందిర నిర్మాణంలో పలు రంగాల నిపుణులు పాలుపంచుకున్నట్లు వెల్లడించారు.

ఐఐటీ- మద్రాస్​, కేంద్ర భవనాల పరిశోధన సంస్థ (సీబీఆర్​ఐ) వంటి సంస్థలు ఇందులో ఉన్నట్లు రాయ్​ పేర్కొన్నారు రాయ్​. మందిర నిర్మాణాన్ని లార్సెన్​ అండ్ టూబ్రో (ఎల్​&టీ) చేపట్టనుండగా.. ఐఐటీ- మద్రాసు నిపుణులు భూమి పరీక్షలు చేయనున్నారు.

భూకంపాలను తట్టుకునేలా..

మందిర నాణ్యతను సీబీఆర్​ఐ పరీక్షించనున్నట్లు రాయ్​ తెలిపారు. భారీ భూకంపాలను తట్టుకుని నిలబడి ఉండేలా ఆలయాన్ని నిర్మించటంలో సీఆర్​బీఐ సహకరించనుందని చెప్పారు.

మందిర నిర్మాణానికి సుమారు 10 వేల రాగి కడ్డీలు అవసరమని తెలుస్తోంది. మందిర నిర్మాణంలో భాగం కావాలనుకునేవారు రాగిని విరాళంగా ఇవ్వాలని రాయ్​ కోరారు.

ఇదీ చూడండి:ఐక్యతా విగ్రహానికి రక్షణగా సీ​ఐఎస్ఎఫ్​ సిబ్బంది​

ABOUT THE AUTHOR

...view details