దేశ సైనిక రహస్యాలను అవివేక ప్రభుత్వం మాత్రమే వెల్లడిస్తుందని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏ కారణంతో సైనిక రహస్యాలను వెల్లడించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
"భారత్కు చాలా ఏళ్ల క్రితం నుంచే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరిజ్ఞానం, సామర్థ్యం ఉంది. తెలివైన ప్రభుత్వం ఈ సైనికి శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతుంది. అవివేక ప్రభుత్వం మాత్రమే సైనిక రహస్యాలను బహిర్గతం చేసి ద్రోహానికి పాల్పడుతుంది."
- చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత ట్వీట్
"సార్వత్రిక ఎన్నికల సమయంలోనే మోదీ ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే భాజపా ఈ కుయుక్తి పన్నింది" అని చిదంబరం దుయ్యబట్టారు.