వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు న్యాయశాఖకు సహకరించడం లేదని ప్రభుత్వ అధికారులు ఓ రాజ్యసభ ప్యానెల్‌కు వెల్లడించారు. అశ్లీల దృశ్యాలు, పిల్లల మీద వాటి ప్రభావంపై దర్యాప్తు చేపడుతున్న ఈ ప్యానెల్ ముందుకు హాజరైన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు.. గోప్యత పేరుతో సామాజిక మాధ్యమాలు న్యాయపరమైన అభ్యర్థనలను కుడా లెక్కచేయడం లేదని పేర్కొన్నారు.
'వాట్సాప్, సిగ్నల్ వంటి మాధ్యమాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ పేరిట న్యాయ సంస్థలతో సహకరించడం లేదు. వినియోగదారుల గోప్యతకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం న్యాయపరమైన అభ్యర్థనను కూడా గౌరవించడం లేదు.'-కేంద్ర ఐటీ శాఖ.
అశ్లీలత, పిల్లలపై వాటి ప్రభావం సహా సామాజిక మాధ్యమాల్లో పోర్నోగ్రఫిని అరికట్టడంపై గత నెలలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత జైరాం నేతృత్వంలో 10 పార్టీలకు చెందిన 14 మంది సభ్యులతో ప్యానెల్ దర్యాప్తు చేపట్టింది.