మండల- మకర సంక్రాంతి సీజన్‌కు సంబంధించి శబరిమల దర్శనానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి వర్చువల్ క్యూపోర్టల్లో టికెట్లను అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. డిసెంబర్ 31 నుంచి మండల పూజ ప్రారంభం కానుంది. బుకింగ్స్ జనవరి 7 వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈ సీజన్లో రోజుకు 5వేల మంది భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు తీసుకు రావాల్సి ఉంటుంది.
శబరిమల మండల పూజకు బుకింగ్స్ ఓపెన్ - కొవిడ్-19
శబరిమలలో మండల-మకర సంక్రాంతి సీజన్ డిసెంబర్31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్శనాలకు బుకింగ్స్ తెరుచుకున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచామని దేవస్థానం బోర్డు తెలిపింది. జనవరి 7 వరకు బుకింగ్స్ కొనసాగుతాయని పేర్కొంది.

శబరిమల మండల పూజకు తెరుచుకున్న బుకింగ్స్
దర్శనానికి 48గంటల ముందు పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి :శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!