తెలంగాణ

telangana

By

Published : May 30, 2020, 12:26 PM IST

Updated : May 30, 2020, 12:40 PM IST

ETV Bharat / bharat

ఎన్​డీఏ 2.0లో తిరుగులేని ఘనతలు సాధించాం: మోదీ

ఎన్​డీఏ సర్కార్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగలేఖతో పాటు ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. తమ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఘన విజయాలు సాధించామని ఆయన పేర్కొన్నారు. కరోనాపై పోరులో భారతావని విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లాక్​డౌన్ వల్ల నష్టపోయిన అన్ని రంగాలకు చేయూతనిస్తూ ఇప్పటికే రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించామని మోదీ తెలిపారు.

One year of NDA 2.0: PM Modi recollects achievements, hurdles faced by his government
ఎన్​డీఏ 2.0లో తిరుగులేని ఘనతలు సాధించాం: మోదీ

ఎన్​డీఏ 2.0 సర్కార్​ ఏర్పడి నేటితో ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. గడిచిన ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, సాధించిన ఘనతలను ఓసారి నెమరువేసుకున్నారు.

"సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ బంగారు అధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఇలా దేశ సేవ చేయడానికి మాకొక మంచి అవకాశం ఇచ్చారు. ప్రజల అభిమానం, మద్దతు నాకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయి."

- ప్రధాని మోదీ ఆడియో సందేశం

సంక్షోభం సమయంలో అండగా నిలిచాం..

కరోనా సంక్షోభం, లాక్​డౌన్ల కారణంగా దెబ్బతిన్న దేశీయ పరిశ్రమలు, ఉద్యోగులు, కార్మికులకు ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్​ కింద ఉద్దీపనలు ప్రకటించామని మోదీ తెలిపారు.

ప్రధాని మోదీ ఆడియో సందేశం

"130 కోట్ల భారతీయులు ఆర్థిక విషయాల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చటమే కాదు... ప్రేరణ కూడా ఇవ్వగలరు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఒక్కటే మార్గం. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఈ సమయంలో పెద్ద ఊరట. దేశంలోని ప్రతి వ్యక్తికి, రైతులు, శ్రామికులు, చిన్నపరిశ్రమలు, స్టార్టప్‌లోని వ్యక్తులకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయుల మేధో శక్తితో రూపొందించిన స్థానిక ఉత్పాదకతకు ఇది ఎంతో మేలు చేస్తుంది."

- ప్రధాని మోదీ, ఆడియో సందేశం

ఏక్ భారత్- శ్రేష్ఠ్​ భారత్​

'కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచంలోని సంపన్న దేశాలను మించి మన దేశప్రజలు చూపిన తెగువ, శక్తిసామర్థ్యాలు అపూర్వమైనవి. కరతాళ ధ్వనులు, దీపాలు వెలిగించడం, సైన్యం ద్వారా వైద్యులను పూలతో సన్మానించడం, జనతా కర్ఫ్యూ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌, అద్భుతమైన ప్రభుత్వ పాలన ద్వారా ఏక్‌భారత్‌- శ్రేష్ఠ్‌భారత్‌ అని నిరూపితమైంది. ఈ పోరాటం సుదీర్ఘమైనది... మనం విజయపథంలో పయనిస్తున్నాం' అని ప్రధాని మోదీ అన్నారు.

చేసి చూపించాం..

2014 నుంచి తమ ప్రభుత్వం అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టిందని మోదీ తెలిపారు. తమ హయాం పరిపాలనలో అలసత్వాన్ని, అవినీతిని రూపుమాపామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులను తుదముట్టిస్తూ సర్జికల్ స్ట్రైక్​, వైమానిక దాడులు చేసి మన దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేశామన్నారు.

'ఆరేళ్ల క్రితం అంటే 2014లో మమ్మల్ని అపూర్వమైన మెజారిటీతో గెలిపించారు. గొప్ప మార్పునకు నాంది పలికారు. ఈ ఆరేళ్లలో శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తూ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాం. ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్​, ఒకే దేశం- ఓకే జీఎస్​టీ, రైతులకు మెరుగైన (ఎంఎస్​పీ) రుణాల హామీ కల్పించాం. అలాగే దేశ అభివృద్ధికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు చేపట్టాం. పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలను తెరవడం; గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. అలాగే పేద ప్రజలకు సొంత ఇళ్లు, మరుగుదొడ్లు కట్టించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడామని' మోదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మోదీ 2.0: నవ శకానికి నాంది.. దౌత్యపరంగా విజయం

Last Updated : May 30, 2020, 12:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details