జమ్ముకశ్మీర్‌లో విద్యుత్, నీటి రుసుములపై ఏడాది పాటు రాయితీ ఇస్తున్నట్లు.. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌కుమార్ సిన్హా తెలిపారు. ఈ నిర్ణయం పేదలకు, రైతులకు, చిరువ్యాపారులకు ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు.
'జమ్ముకశ్మీర్‌లో విద్యుత్, నీటి రుసుములపై రాయితీ' - జమ్ముకశ్మీర్ వార్తలు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్యాకేజీ అందిస్తున్నట్లు చెప్పారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌కుమార్ సిన్హా. విద్యుత్తు, నీటి రుసుములపై ఏడాది పాటు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌కుమార్ సిన్హా
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా స్తంభించిన వాణిజ్య కార్యక్రమాలతో పాటు ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే లక్ష్యంగా రూ.1350 కోట్ల ప్యాకేజీని అందిస్తున్నట్లు సిన్హా వివరించారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా తీసుకొస్తామనన్నారు. 2021మార్చి వరకు స్టాంప్ డ్యూటీ కూడా మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా ఉద్ధృతి వేళ పార్లమెంట్ సమావేశాల కుదింపు!