ప్రజలు ఓటు వేసి ఇచ్చిన శక్తితోనే పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై కేంద్రప్రభుత్వం లక్షిత దాడులు చేయగలిగిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 2016 లక్షిత దాడులు, బాలాకోట్ వైమానిక దాడి, ఏశాట్ క్షిపణి ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని భతపరలో భాజపా ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని. ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.
"ఓ బడా కాంగ్రెస్ నేత తుగ్లక్ రోడ్డులో ఉంటారు. అక్కడి నుంచి ఎన్నో కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం కోసం తరలించారు. అది అంత చిన్న విషయం కాదు. పేద పిల్లలను పౌష్టికాహార లోపం నుంచి రక్షించేందుకు, వారికి భోజనం పెట్టేందుకు, గర్భవతుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పంపిన నిధుల నుంచీ వీరు దొంగలించారు. కానీ నేనూ చౌకీదారును. పిల్లలు, గర్భవతుల నుంచి దొంగలించే వారికి కచ్చితంగా శిక్షపడేలా చేస్తాను."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.