తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్​కౌంటర్​: పుల్వామాలో మరో ముష్కరుడు హతం

By

Published : Sep 24, 2020, 9:06 AM IST

Updated : Sep 24, 2020, 11:34 AM IST

One unidentified terrorist killed in Awantipora
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

11:29 September 24

పుల్వామాలో మరో ముష్కరుడు హతం

పుల్వామాలో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది భారత సైన్యం. పుల్వామా జిల్లాలోని మాచ్చిహమ్​లో జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. అయితే.. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

10:06 September 24

కశ్మీర్​ ఎన్​కౌంటర్​- సీఆర్​పీఎఫ్​ జవాన్​ మృతి

జమ్ముకశ్మీర్​లో గురువారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్​ మృతిచెందారు. బుద్గాం జిల్లాలోని చాదూరా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో గాయపడిన జవాన్​ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ జవాన్​ మృతి చెందినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఓ ఉగ్రవాది హతం

అవంతిపొరాలోని మాఘామా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో గాలింపు చర్యలు చేపట్టాయి భద్రతా బలగాలు. వీరిని చూసి కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. అనంతరం ఎదురుదాడికి దిగిన సైనికులు.. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. అయితే.. ఉగ్రవేట ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

08:58 September 24

కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ అవంతిపొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కార్డన్​ సెర్చ్​ నిర్వహిస్తుండగా.. తారసపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముష్కరుడు మృతి చెందగా.. మిగతా వారి కోసం దళాలు గాలిస్తున్నాయి.

Last Updated : Sep 24, 2020, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details