తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం - terrorist killed in Kashmir

One terrorist eliminated in a joint operation in Shopian
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

By

Published : Jun 21, 2020, 7:02 AM IST

Updated : Jun 21, 2020, 1:15 PM IST

13:12 June 21

శ్రీనగర్​లో ముగ్గురు ముష్కరులు హతం

శ్రీనగర్ లోని జాదిబాల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో తాజాగా ఇద్దరు ముష్కరులు హతమయిన నేపథ్యంలో.. మృతుల సంఖ్య మూడుకు చేరింది.

నిఘా వర్గాల కచ్చితమైన సమాచారం మేరకు జాదిబాల్ ప్రాంతంలో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సమాధానంగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేశారు. ఈ ఆపరేషన్​లో ఇప్పటివరకు ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ముష్కరుల ఏరివేత కోసం ఇప్పటికే అంతర్జాల సేవలు నిలిపేశారు. ప్రజా రవాణాపై ఆంక్షలు విధించారు. ఆపరేషన్ కొనసాగుతోంది.

12:28 June 21

శ్రీనగర్​లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ లోని జాదిబాల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్ లోని జాదిబాల్ ప్రాంతంలో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగర వ్యాప్తంగా అంతర్జాల సేవలను నిలిపివేశారు. ప్రజారవాణాపై కూడా నిషేదాజ్ఞలు విధించారు. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతోంది.

07:19 June 21

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో​ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.

ఈ ఆపరేషన్​లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అధికారులు. సోదాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శ్రీనగర్​లోని జాదిబాల్​ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టింది సైన్యం. ఇందుకోసం ఆ ప్రాంతంలో మొబైల్​, ఇంటర్నెట్​ సేవలను నిలిపివేసి ఆపరేషన్ నిర్వహించింది.  

మరోసారి పాక్​ కాల్పుల విరమణ ఉల్లంఘన

ఇదే సమయంలో పూంచ్​ జిల్లా బాలకోట్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది పాక్​. ఆదివారం ఉదయం 6.15 గంటలకు, మోర్టార్​ షెల్స్​తో దాడులు చేసింది పాక్​ సైన్యం. అయితే పాక్ దుశ్చర్యను భారత భద్రత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

06:58 June 21

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో షోపియాన్‌లో భద్రత దళాలు, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా దళాలు సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Last Updated : Jun 21, 2020, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details