తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూన్​ 1 నుంచి ఒకే దేశం- ఒకే రేషన్​కార్డు అమలు - Ram Vilas Paswan

ఒకే దేశం- ఒకే కార్డు పథకంపై రాజ్యసభ వేదికగా వివరణ ఇచ్చారు పౌరసరఫరాల శాఖమంత్రి రాంవిలాస్ ​పాసవాన్. జూన్​ 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్రతిపాదిత ఒకే దేశం-ఒకే రేషన్​కార్డును అమల్లోకి తేనున్నట్లు స్పష్టం చేశారు.

'One nation, one ration card' scheme will be made applicable across country from June
జూన్​ 1 నుంచి ఒకే దేశం- ఒకే రేషన్​కార్డు అమలు

By

Published : Feb 8, 2020, 5:51 AM IST

Updated : Feb 29, 2020, 2:34 PM IST

ఒకే దేశం- ఒకే రేషన్​కార్డు పథకం జూన్​ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర పౌరసరఫరాల శాఖమంత్రి రాంవిలాస్ పాసవాన్​. పలు ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానునట్లు రాజ్యసభ వేదికగా ప్రకటన చేశారు. నూతన విధానం ద్వారా రేషన్​కార్డులు కలిగిన వారు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా సరుకులు​ పొందే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఆధార్​ కార్డుల అనుసంధానం ఈ ఏడాది జూన్​ నాటికి పూర్తి అవుతుందని సమాచారం.

ఇప్పటికే 12 రాష్ట్రాల్లో...

ఇప్పటికే ఈ పథకం 12 రాష్ట్రాల్లో అమలులో ఉందన్నారు పాసవాన్. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్​, కేరళ, రాజస్థాన్​, కర్ణాటక, హర్యానా, త్రిపుర, గోవా, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​లల్లో జనవరి 1 నుంచే అమలవుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ముంబయి కాలా చౌకీలో అగ్నిప్రమాదం

Last Updated : Feb 29, 2020, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details