దిల్లీలో నిరసనలు చేపట్టిన రైతులకు మరో చేదు వార్త అందింది. దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పంజాబ్‌కు చెందిన భీమ్ సింగ్‌గా గుర్తించారు.
అయితే ఈయన సింఘూ సరిహద్దు వద్ద ఉన్న ఓ కాలువలో పడి మరణించినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పంచనామా కోసం అసుపత్రికి తరలించారు.