తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో ప్రభుత్వ ఉద్యోగి మృతి.. తండ్రికీ సోకిన వైరస్ - coronavirus condition overview

కరోనా వైరస్ కారణంగా మధ్యప్రదేశ్​లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో వైరస్ మృతుల సంఖ్య 11కి చేరింది. బాధితుడు ఇండోర్​లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇండోర్​లో వైరస్ కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి మృతుడికి కరోనా సోకి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

mp
మధ్యప్రదేశ్​లో మరో వ్యక్తి మృతి

By

Published : Apr 4, 2020, 12:33 PM IST

కరోనా వైరస్​తో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చింద్వాడాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి రెండు రోజుల క్రితం వైరస్ నిర్ధరణ అయింది. నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన కారణంగా అతని తండ్రికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. తాజా మరణంతో రాష్ట్రంలో వైరస్ మృతుల సంఖ్య 11కి చేరింది.

"తాజాగా మృతిచెందిన వ్యక్తి ఇండోర్​లో ప్రభుత్వ ఉద్యోగి. మధ్యప్రదేశ్​లో కొవిడ్-19 ప్రభావిత ప్రాంతాల్లో ఇండోర్ ఒకటి. ఈ కారణంగా అతనికి వైరస్ సోకి ఉండొచ్చు. బాధితుడి తండ్రికి కూడా వైరస్ ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం."

-చింద్వాడా జిల్లా అధికారులు

మధ్యప్రదేశ్​లో ఇంతకుముందు ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్​లో ఏడుగురు, ఉజ్జయినిలో ఇద్దరు, కర్​గోన్​లో ఒకరు మృతి చెందారు.

ఇదీ చూడండి:వైరస్​పై పోరులో 'జుగాడ్'​- త్రీడీ ప్రింటర్​తో మాస్కులు

ABOUT THE AUTHOR

...view details