తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు - కొవిడ్​-19 తాజా వార్తలు

one-more-death-due-to-corona
దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు

By

Published : Mar 19, 2020, 4:59 PM IST

Updated : Mar 19, 2020, 6:05 PM IST

17:59 March 19

భారత్​పై కరోనా పంజా.. 4కు చేరిన మృతులు

కరోనా వైరస్​ దేశంలో మరొకరిని బలితీసుకుంది. పంజాబ్​కు చెందిన ఓ 70 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా భారత్​లో వైరస్​తో మరణించిన వారి సంఖ్య 4కు చేరింది. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్​లో మరణాలు సంభవించాయి.  

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. దేశంలో వైరస్ కేసుల సంఖ్య 173కు చేరినట్లు తెలిపింది. ఇందులో 25 మంది విదేశీయులు (ఇటలీ-17, ఫిలిప్పీన్స్-3, బ్రిటన్​-2, కెనడా-1, ఇండోనేషియ-1, సింగపుర్-1) ఉన్నారు.  

" ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్​ బారిన పడి చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 149 తొమ్మిది. ఇప్పటి వరకు 20 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు." 

                                                            - కేంద్ర ఆరోగ్య శాఖ

రాష్ట్రాల వారిగా కేసుల వివరాలు

రాష్ట్రం కేసుల సంఖ్య విదేశీయులు
మహారాష్ట్ర 47 3
కేరళ   27 2
యూపీ  19  1
హరియాణా  17 14
కర్ణాటక  14  0
దిల్లీ  12 1
లద్దాఖ్​  0
రాజస్థాన్​ 2
తెలంగాణ 2

జమ్ముకశ్మీర్​-4, తమిళనాడు-  2, పంజాబ్​-2 సహా ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, ఉత్తరాఖండ్​, బంగాల్​, పుదుచ్చేరి, చండీగఢ్​ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

16:56 March 19

దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు

భారత్​లో కరోనా రాకాసికి మరొకరు బలయ్యారు. పంజాబ్​లో 70 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఫలితంగా దేశంలో వైరస్​ కారణంగా మరణించిన వారి సంఖ్య 4కు చేరింది. 

ప్రస్తుతం భారత్​లో 167 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది విదేశీయులు. మరో 15 మంది పూర్తిగా కోలుకున్నారు.

Last Updated : Mar 19, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details