దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన ఇండిగో విమానం సీటు కింద ఉన్న కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణికులు అందరూ దిగిన తరువాత పారిశుద్ధ్య కార్మికులు విమానాన్ని శుభ్రపరుస్తూ... బంగారాన్ని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
విమానం సీటు కింద కిలో బంగారం - ఇండిగో విమానం సీటు కింద బంగారం
బంగారాన్ని ఎవరు మాత్రం వద్దనుకుంటారు? కానీ దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన ఓ ప్రయాణికుడు మాత్రం తాను వచ్చిన విమానం సీటు కింద సుమారు 50 లక్షలు విలువ చేసే పుత్తడి వదిలివెళ్లాడు.
సీటు కింద 50 లక్షల బంగారం వదిలి వెళ్లిన ప్రయాణికుడు
అధికారులు అదే విమానంలో వచ్చిన వారిని తనిఖీ చేశారు. వివేక్ మనోహరన్ అనే ప్రయాణికుడి బాటులో 200 గ్రాముల బంగారాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.