బస్సు బోల్తా - ఒకరు మృతి, 10 మంది పరిస్థితి విషమం - ఒడిశాలో పర్యటక బస్సు బోల్తా
09:47 January 18
బస్సు బోల్తా - ఒకరు మృతి, 10 మంది పరిస్థితి విషమం
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది పర్యటకులతో భువనేశ్వర్ వెళ్తున్న టూరిస్ట్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన గజపతి జిల్లా అదబా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుంబులా చౌక్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు భువనేశ్వర్‌కు చెందిన సునీల్ సాహుగా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రులను మోహన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
కోరాపట్ జిల్లాలోని గుప్తేశ్వర్ ఆలయ దర్శనం అనంతరం పర్యటక బస్సు భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
TAGGED:
ఒడిశాలో పర్యటక బస్సు బోల్తా