తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లష్కరే స్థావరంపై దాడి- కీలక ముష్కరుడు అరెస్ట్ - ఉగ్రవాద రహస్య స్థావరాలు జమ్ము పోలీసులు

జమ్ము కశ్మీర్​లోని బుద్గామ్, అరిజాల్ ఖాన్​సాహిబ్​ ప్రాంతాల్లో ముష్కరులు నక్కిన ఓ రహస్య ప్రదేశాన్ని పోలీసులు చేధించారు. ఓ లష్కరే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందిన సమాచారంతో మరో నలుగురు సహాయకుల్ని అరెస్టు చేశారు.

One hideout busted in Arizal Khansaib
లష్కరే స్థావరంపై దాడి-కీలక ముష్కరుడి అరెస్ట్

By

Published : May 16, 2020, 1:06 PM IST

ఉగ్రవాదులపై సైన్యం, పోలీసుల దూకుడు కొనసాగుతోంది. సరిగ్గా పది రోజుల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్​ కమాండర్ రిజాజ్ నైకూను సైన్యం మట్టుబెట్టగా.. తాజాగా జమ్ము కశ్మీర్​లోని అరిజాల్ ఖాన్​సాహిబ్, బుద్గామ్​ ప్రాంతాల్లో ముష్కరులు నక్కిన ఓ స్థావరాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు గుర్తించారు.

ఉగ్రవాదుల రహస్య స్థావరం

రహస్య స్థావరంలో దాక్కున్న లష్కరే తొయిబాకు చెందిన అత్యున్నత కార్యదళ సభ్యుడు 'జహూర్​ వనీ'ని అరెస్టు చేసినట్లు జమ్ము కశ్మీర్​ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

లష్కరే ఉగ్రవాది జహుర్ వనీ

మరో నలుగురు

అనంతరం విచారణలో అందిన సమాచారంతో ఉగ్రవాదులతో సంబంధం ఉన్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. వీరంతా ఖాన్​సాహిబ్ ప్రాంతానికి చెందినవారేనని స్పష్టం చేశారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. గత కొద్ది నెలలుగా ముష్కరులు ఈ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

రహస్య స్థావరం వద్ద భద్రతా సిబ్బంది
రహస్య స్థావరంలో పోలీసుల తనిఖీ

ABOUT THE AUTHOR

...view details